Banner
Banner

అవును పోర్చుగల్ ని ఈ రేటు పెట్టి ఒకరు సొంతం చేసేసుకున్నారు. అదేంటి ముందే తెలిస్తే ఆ మాత్రం డబ్బు అప్పో సొప్పో చేసేసి, ఆ దేశాన్ని సొంతం చేసేసుకుని , ఆ దేశ చక్రవర్తి అయ్యిపోదామనుకుంటున్నారా..అంత లేదు… ఆ డబ్బు కట్టేయగానే ఆ దేశం మొత్తం రాసిచ్చేయలేదు. Portugal.com చేతిలో పెట్టారు. ఆ సైట్ ని  ఏం చేసుకుంటారంటారా..అది వాళ్ల ఇష్టం. ఈ వెబ్ సైట్ కు అంత రేటు కట్టి కొన్నారంటే వాళ్ల దగ్గర పెద్ద ఆలోచనే ఉండచ్చు. వేరే వారికి  రేటు పెంచి అమ్మేయచ్చు.

 ఆ కొనుక్కున్న ఆయన పేరు  Andrew Rosener అంటున్నారు. Andrew చాలా సంవత్సరాలుగా పోర్చుగీస్ లో ఉంటున్నారు. ఆయన కూడా తన దగ్గర ఆ సైట్ ఉంచుకోనని, వేరే వారికోసం కొన్నా అన్నారట. ఇలా దేశాలు పేరుతో ఉండే వెబ్ సైట్స్ కు మంచి డిమాండ్ ఉందిట. గతంలో అమ్ముడైన కొన్ని దేశాల డొమైన్స్ ఎంత పలికాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Korea.com – $5 million
England.com – $2 million
Russia.com – $1.5 million
Singapore.com – $800,000
Brazil.com – $500,000
NewZealand.com – $500,000
Iran.com – $400,000
Gibraltar.com – $360,000

ఇక పోర్చుగల్ అసలు పేరు పోర్చుగీస్ రిపబ్లిక్.  దీనికి లిస్బన్ రాజధాని. ఐరోపాలోని ఐబీరియా ద్వీపకల్పంలోని ఒక దేశం. ఐరోపాలో ఉన్న పోర్చుగల్ అట్లాంటిక్ మహాసముద్రానికి తూర్పు, ఉత్తర దిశలలో, స్పెయిన్కు పశ్చిమ, దక్షిణ దిశలలో ఉంది. 15వ శతాబ్దంలో ఈ దేశాన్ని మొట్టమొదటగా ప్రపంచానికి పరిచయం చేసింది ప్రిన్స్‌హెన్రీ.వాస్కోడిగామా తన సముద్ర ప్రయాణం ఈ దేశం నుండే ప్రారంభించాడు. ఆ తరువాత ఆయన భారతదేశం వచ్చారు. 1999 వరకు ఈ దేశాన్ని పోర్చుగీసు రాజు కుటుంబం దాదాపు 600 సంవత్సరాలు పరిపాలించింది. క్రీ.శ.1139లోనే ఈ దేశంలో రాజరిక వ్యవ స్థ ప్రారంభమైంది. అయితే 1910 అక్టోబర్ 5న దేశాన్ని ఒక గణతంత్ర దేశంగా ప్రకటించారు

Banner
, , , , ,
Similar Posts
Latest Posts from domainlu.com
Banner